Friday, 9 February 2018

తాను నేను

మనసుకెంత యాతనో... నీ తలపుల పలుకులకు దూరంగా ఉంటే....
మరుపుకెంత మురిపెమో... నీ, నా ఎడబాటును చూసి.....

మురిసే నవ్వుల సడిలో నడచి....
మురిపాల పరువాలలో తానమాడితే...
చలి కొండెక్కి, కొంగును కసురుతుంది కప్పుకోమంటూ...
చీకటి కనుపాపలో నువ్వు జీవం పోసుకుంటుంటే...

నేనున్నది నీలోనే అన్న భావం....
నా బతుకును నీకు జత కట్టి పొమ్మంటుంది...❤❤
నీ ఎద సింహాసనం కన్నా ఇంకేం కావాలోయ్....
ఈ చిన్ని మనసుకు...😍😍

✍️అరుణిమలు

No comments:

Post a Comment