కలలో రాయబారాలు పంపావా... కళ్ళు కలవరిస్తున్నాయి..
ఊహలకు రంగులు అద్దావా... మెరిసిపోతున్నాయి..
భావాలకు భాషను నేర్పావా... పఠిస్తున్నాయి..
ఇష్టానికి ఇమిడిపోవడం నేర్పావా... వంపులు పోతుంది..
కలానికి ఊపిరి పోసావా.. లిఖించమంటుంది..
చెప్పనా మరీ...నువ్వు, నేను ఏంటో
మనకు మనం ఏమౌతామో...
ఆయువులకు వాయువు అవసరమే..
నాకు నీ పేరులా..
ప్రేమకు ఆరాధన అవసరమే..
మన మధ్యలో వంతెనలా..
ఎదరుపడలేని కోర్కెలు అవసరమే..
ఎదను నిన్ను బంధించేందుకు..
ఎవరు మనం...
కనురెప్పలం...
కలిసి ఉండలేం...
కలవకుండా అస్సలు ఉండలేం !!
✍️అరుణిమలు
No comments:
Post a Comment