Friday, 2 February 2018

నాలో నేను

మనసు మళ్ళీ మళ్ళీ వడ్డించే విస్తరి కాదు..
తనువు మళ్ళీ మళ్ళీ మార్చే పానుపు కాదు..

ఆత్మాభిమానం అంటే అణుకువ కాదు..
వైఖరి అంటే తెగింపు కాదు..

తలలో నాలుకలమే...
తలదించుకునే స్థితికి మాత్రం ఆమడ దూరం...

స్వేచ్ఛ అంటే పరిదులు దాటనిది..
పొగరు,వగరు కలబోత నా నైజం..

అభిమానం నా ఆభరణం...
చిరునవ్వు నా దైర్యం...

అందరికి అయిన వారమే అంతలో ఉండి..
కొందరికి‌ మాత్రం ఆత్మీయులం చేరువలో ఉండి..

ఒకరికి మాత్రమే సొంతం..
అంతే కొన్ని జన్మలు...
నేనింతే...

✍️అరుణిమలు

No comments:

Post a Comment