Friday, 2 February 2018

తాను నేను

నీ చూపులను తాళగలనా...

నీ మాటలను మీరగలనా...

నీ నవ్వులను ఏరగలనా...

నీ మౌనాన్ని భరించగలనా...

నీ దూరాన్ని సహించగలనా...

నీ నిర్లక్ష్యంలో జీవించగలనా...

నీ అంటే..... నువ్వు కాదురా మనం అని....
అక్కడ నీ చర్యలకు నలిగేది ఇక్కడ నీ మనిషని తెలిసేది ఏనాటికిరా....

✍️అరుణిమలు

No comments:

Post a Comment