Friday, 2 February 2018

తాను నేను

సడి లేని ప్రశ్నల శరాలు ఎన్నో.. మౌనాన్ని చేదిస్తున్నాయి..
సద్దు చేయని గాయాలకు చలించిన మనసు సేద తీరుతుంది చినుకుల మాటున దాగి...
తప్పించుకోలేని ఈ తడి తాకిడి తెల్లారే వరకు తప్పదు..

పొద్దు పొడిస్తే నవ్వులను పులిమిన మోముతో మదిని అదిమి పెట్టాలిగా..
నటనలు...బతకడానికి ఒకరు... అనుభవించడానికి ఒకరు...
జీవిస్తున్న, మహా నటుల నడుమ చిక్కిన లేడి పిల్లలా..దాని గతి ఇంతే...
ఆడుకుంటారో...వాడుకుంటారో...ఏమార్చి చోద్యం చూస్తారో...

నా నటన నన్ను చూసి నవ్వుతుంది...చాల్లే ఇంక గమనించే వారు ఎవరు లేరిక్కడ అంటూ...
నన్ను నేను మభ్యపెట్టుకోనివ్వే ఇలా అయినా...
జీవించడం మొదలు పెడితే గతం ఇచ్చిన గాయాలలో పూర్తిగా బందీని అయిపోతా...

✍️అరుణిమలు

No comments:

Post a Comment