క్షణాలు
నిమిషాలు
గంటలు
రోజులు
సంవత్సరాలు
గడచి పోతున్నాయి తమకేం పట్టనట్డు....
కానీ మనసు మాత్రం ఎక్కడో ఆగిపోయింది....
అక్కడే....నువ్వు కలిసిన ఆ చోటనే...
గిరి గీయని బంధం గాయాలు పాలు చేసి వేడుక చూస్తుంది...
అయినా(ఇప్పటికీ) నీ పేరు పలుకుతుంటే అదే తీయదనం..
నీ తలపుల మునకలలో మైమరచి పోవడం..
నీ ఊహ ఊపిరి ఆడనివ్వదు..
నీ వలపుల జ్ఞాపకాలు విస్తరిస్తూ పులకిస్తున్నాయి...
నీ అనుభవాల ఆరగింపుతోనే రోజు గడిచేది...పొద్దు పొడిచేది..
ఎందుకిలా....ఎందుకో ఇలా....
నీకు లేని ఈ తపన నాకెందుకో...
నాకే ఎందుకిలా....
చల్... అని పంపేయాలని ఉన్నా...
చేతకాని పనికి మూల్యం చెల్లిస్తున్న...
ఇలా నీ భావాల బంధనంలో బంధీనై....
✍️అరుణిమలు
No comments:
Post a Comment