Friday, 2 February 2018

తాను నేను

ధ్యానమా ఇది పరధ్యానమా...
ఏదైతే ఏముంది..ఏదైనా ఆ చోటుని ఆక్రమించేది
నువ్వే కదా.....
కలవరిస్తూ అలసిన రెప్పలు.. తలవాల్చాయి నీ రూపాన్ని చూద్దామని.....
ఎదురుగా లేనా అని ప్రశ్నించకోయ్....
నా మనసు చూపించే మనిషికి....ఎదురుగా కనిపించే నిజ రూపానికి పోలికలే లేవు...

ఓయ్ ఏం చేస్తున్నావు....వైటింగ్ ఇక్కడ....అమ్మా అలక తీరదా....నిన్నే, నే పోతున్న...
ఎప్పుడో నువ్వు పలికిన మాటలు...వింటున్నా మళ్ళీ మళ్ళీ...మనసు ఆకలి తీర్చేందుకు నెమరేస్తూ....

ఎదురు చూపులకు వదిలేసి...నిర్లక్ష్యంతో నన్ను పరీక్షిస్తూ....
ఏమౌతానో తెలియని గడప పై వదిలి పోయిన....నీ పిలుపుకు మనసు పరుగులు తీస్తుంటే...
అభిమానాన్ని వదిలి బదులు ఇవ్వ లేక, నే పడ్డ యాతన ఇప్పటికీ గురుతే....
అయినా విజయం నీదే గా....నువ్వు గెలిచింది మనసును కదా....

నువ్వు దూరంగా ఉన్నంతవరకు ఒక బాధ...
వచ్చాక నేనొక అవసరాన్ని అనే పచ్చి నిజం ఒక బాధ...
అదొక నరకం...మనసు బతికి మనిషిగా జీవం కోల్పోయిన రోజులు...

జరిగినదంతా మరచిపోలేవా అన్నావు....
ఏం మరచిపోవాలో అర్థం కాలేదు ఇప్పటికీ...
నిన్ను మరచిపోవాలా....నువ్వు చేసిన గాయాలను మరచిపోవాలా...

ఇప్పుడే నయం....ఒకటే బాధ...
ఇక్కడ కూడా క్లారిటి లేదు...నువ్వు దగ్గర లేవు...
అవసరం లేక లేవా లేదా సాటి మనిషిగా కూడా ఉండ లేక లేవా...???
బదులు దొరకని ప్రశ్నలు...

✍️అరుణిమలు

No comments:

Post a Comment