Friday, 2 February 2018

తాను నేను

నీ నవ్వుల మేలుకొలుపులు...
నీ కన్నుల పడకింటిలో పవళింపులు...
నువ్వు కప్పిన రెప్పల దుప్పటి...

జోల పాడేవేళ పాల నురుగు పానుపులు...
నీ కనుల గడపన పసిపాపల చూసే ఉషోదయాలు...

నువ్వు చూపించే లోకం...
నువ్వు నడిపించే దారి...

ఆనవాళ్ళు ఎరుగని అనురాగాల సంపద...
ఇవి చాలవా, ఇవేగా నా గుప్పిట నే దాచే నువ్వు ఇచ్చే తాయిలం....

✍️అరుణిమలు

No comments:

Post a Comment