వదిలేయాలని ఉంది చేపట్టలేని చెరపట్టిన చెదల జ్ఞాపకాలను...
చెరిపేయాలని మనసు తపిస్తుంది చెరగని మన చరితను...
కడిగేయాలని ఉంది కలతగా మారిన మన కథను...
చీ... అని పక్కకు నెట్టాలని ఉంది గత కాలాన్నీ...
సొంత దేహంలో, అరువు మనసుతో ఈ సహజీవనం దేనికసలు, ఎన్నాళ్ళు ఇలా...
లోకాన్ని చూసి నవ్వుతున్న...నను నేను దాచుకొని... ఒక్కోసారి ఈ మాసిక తీసి పక్కన పెట్టాలని అనిపిస్తుంది...
ఎలా ఉన్నానో చూడటానికి...
చేచిక్కిన చేత నలిగిన మనసుకు ఆయువు అవసరమా ఇంకా....
నమ్మకాన్ని నడివీదిలో నగ్నంగా వదిలేసిన నరుని కోసమా ఈ తపన...
అసహ్యం చిరునామాకు కూడా చిక్కలేదు నీకై...
వాడకాలు ఇలా ఉంటాయని ఎరగని ఆత్మ నీ వాడకాన్ని చూసి ఘోషిస్తుంది....
వద్దు నువ్వనే ఆలోచన...
విలువ తెలియని నీ విలువకు నే వలువ కాలేను...
మనసులతో ఆటలు, ఎదలో చిచ్చు పెట్డి వేడుక చూసే నిన్ను వదిలి పోలేని ఈ బలహీనత దేనికింకా...
మాటకున్న పదును మనసుకు వచ్చేది ఏ నాటికి...
నువ్వు మొదలు పెట్టి ముగించిన నీ రాక్షస క్రీడ నుండి ఇంకే నాటికి బయట పడేది...
ఏ కవచ కుండలాలను దరించేది నీ ఆలోచనలు నన్ను తాకకుండా ఉండేందుకు...
అరుణిమలు
No comments:
Post a Comment