అలుసే మరి అలుపెరుగని నా అభిమానాన్ని చూస్తే నీకు..
అలుసే మరి నీ పిలుపుకు బదులేదని ఎదురు చూసే అవకాశం ఇవ్వలేదు కదా..
అలుసే మరి నా అలకలన్నీ నీ జాడ తెలియగానే పత్తా లేకుండా పోతాయి కదా..
అలుసే మరి నీ స్థానం ఇక్కడ ఎప్పుడు పదిలమే అనే భరోసా నీ ఊహకు అందింది కదూ..
అలుసే మరి నీ అబద్దాలని కూడా అవునా అంటూ నవ్వి పక్కన పెట్టాను కదూ..
అలుసే మరి ఆ అలుసుకు అలుపొచ్చినా నాకు అలుపు రానందుకు..
అలిసిన నా మనసుకు మాత్రం నువ్వో ఔషధానివి...
నీ జ్ఞాపకాలను ఊపిరిగా శ్వాసిస్తున్న జీవాన్ని....
నాకు నేను అన్నా అలుసే..
నా బలహీనత నువ్వు అయ్యినందుకు..
✍️అరుణిమలు
No comments:
Post a Comment