నువ్వు కావాలనే కోరిక లేదు
నిన్ను చేరాలనే తపన లేదు
నీ మాట వినాలనే ఆరాటం లేదు
నీతో నడవాలనే భ్రమ లేదు
నిన్ను కలుసుకోవాలనే ఆశ లేదు
నీకై కలవరించే కలలు లేవు
నీపై కోపం లేదు...
ఇక అసహ్యం నీ కోసం వస్తే నన్ను దాటాలి ముందు..
ఉన్నది ఒకటే ఆశ
మనిషిగా నిన్ను చూడాలని
ఈ జన్మకు తీరుతుందా..
పైవన్ని ఆలోచనలు..
చివరాకరి మాటలు మాత్రం...
నే కలవరించే కలల కలతలు...
వాస్తవానికి చేరువ కాలేని తీరంలో నిలిచిన కోరిక అది...
✍️అరుణిమలు
No comments:
Post a Comment