Friday, 2 February 2018

తాను నేను

నీతో చేసిన ప్రయాణంలో ఆటుపోట్లు ఎన్నో....
నీకై ఎదురు చూసిన వాకిలిలో నా నిట్టూర్పుల ముగ్గులు ఎన్నో...
నీపై పెంచుకున్న ప్రేమ పరవళ్ళలో నువ్వు కదిపే సుడిగుండాలు ఎన్నో..‌‌..
నీకోసం దాచుకున్న ఆశల శిథిలాలలో చెదిరిన శిలాఫలకాలు మనం....
నీకై దాచిన నవ్వులు శిధిల పత్రాలుగా మారి నన్ను అభిషేకిస్తున్నాయి....
నా ఎదురు చూపుల పరిహాసాలలో జ్వలించే దివ్వెను అవుతున్న....
నువ్వు చిదిమేసిన ఆశలను ఏరి దోసిట పట్టి ‌నా నిశ్వాసలతో సేద తీరుస్తున్న....
నీకై జారే లవణాక్షితలు జల్లే కళ్ళాపిలో నే నీ పేరు లిఖిస్తున్న....
ఈ మనసు నుండి కూడా ఆవిరై పొమ్మంటు....

✍️అరుణిమలు

No comments:

Post a Comment