గతమేదైనా మన వెంటే ఉంటుంది...
మరుపున్నది కానీ మారాం చేస్తుంది...
అడుగులు ఆగేది ఎక్కడ....
నీ నీడ తాకిన చోటునే కదా...
ముడుపులు కడుతునే ఉన్న మనసుకు
ఓపిక పట్టమని నీ రాకకై...
బాదించేదో, భరించేదో కానీ
అదే భాగ్యం అంటుంది పిచ్చి మనసు...
ఎదుట పడని నీకై
వెనుతిరిగి చూడటం దేనికో....
ఆశలకు రెక్కలు లేవు
ఆనవాళ్ళు లేవు అన్ని అడుగంటి పోయాయి....
ఓయ్.....అని పిలవాలని పెదవికి లేదు
కానీ మనసు తపిస్తూ మరి స్మరిస్తుంది...
కొన్ని క్షణాల బంధం మనది...
దాని ఆయువు మాత్రం
నేను ఉన్నంత వరకు పోయేది లేదని చెబుతుంది...!!!
ఏయ్.....
నా పిలుపును అద్దుకున్న చూపులను వదిలేసా....
నీకై వెతుకుతూ వచ్చి...
నిన్ను చేరిన రోజున తుళ్ళిపడకు...
ఇంకా నా ఙాపకాలను మరవలేదా అని...
నువ్వంతే...
నేనింతేనోయ్...
✍️అరుణిమలు
No comments:
Post a Comment