Friday, 2 February 2018

తాను నేను

ఏ చిరుగాలితో కబురంపావోయ్
నీ మాటల సువాసనలను మోసుకొచ్చి...
నీ చూపుల గందాలను అద్దుతోంది...

చూసి రమ్మన్నావా...
కొసరి తీసుకురమ్మన్నావా తాయిలాన్ని...
చైత్ర రాగాన్ని మీటుతుంది
అణువణువు సవరిస్తూ....

✍️అరుణిమలు

No comments:

Post a Comment