Friday, 2 February 2018

తాను నేను

అలంకారాలన్ని తనువుకే....
ఎన్నెన్ని చేరినా అసంపూర్ణమే...
నీ పేరు అద్దుకోని అదరాల ఒంపులు
నిను దాచుకోని మనసు...
నీకై ఎదురు చూడని కలల కనులు..
నీ ఊహలు చేర్చని సిగ్గులు...
నీలో దాగిన నా ఆశల వెలుగులు...
నీకోసం ఎదురుచూసే పలకరింపుల సువాసనలు...
నీ కబురు మోసుకొచ్చే ఆ గాలి లేఖలు...

ఓయ్...వాడిపోని ఎదురు చూపులు ఉన్నాయి ఇక్కడ..
విసుగెరుగని పసిడి చాయలు అద్దుకుని కాచుకున్న..
పరీక్ష నాది....ఫలితం నీది..
పేరు నీది.....ప్రాప్తం నాది..

✍️అరుణిమలు

No comments:

Post a Comment