నొసటి రాతవో...
పెదవి విరుపువో...
నా చుట్టూ నే గీసిన గిరివో...
గిరి లోన నువ్వనే ఏకాంత లోకం...
ఆవల ఏమో నువ్వు లేని ఏకాంత వాసం...
రెండు కను బొమ్మలమై ఉన్నాం...
దూరం తరగనిదే కానీ...
కలిపేది మనం అనే బంధం...
అదే... ఆనకట్ట కుంకుమై పండింది...
పసుపు బట్టలు కట్టాం, పండిన చేనులా...
కోతకు సిద్దమై....
సరసాలు సెగపాలేలే...
నువ్వు నలుడువై విందారగించగా చెంత చేరితే...
తోడేందుకు ఏముంది ఇక్కడ...
తొందర తగని తగవులో తనువులు తాళం వేస్తుంటే....
లోకాలను జోకోట్టే దాక....
రేయి పంట కోతకు...
తొందర తగదు...
✍️అరుణిమలు
No comments:
Post a Comment