Friday, 2 February 2018

తాను నేను

పెదవులలో పడి, పలుకుల మధ్యలో దూరి అల్లరి చేయకోయ్...
నలిగి నలిగి పెదవుల మధ్య, పెదవికి అద్దకంగా మారి మెరవకు..

రెప్పల మాటున దాగి దాగుడుమూతలు ఆడుతూ...
మూసిన రెప్ప మాటున,తెరిచిన కనులకు ఎదురుగా నిన్ను చూసి మురిసిపోకోయ్...

నీ ఆలోచనల అలికిడి నన్ను తాకగానే..
గుండెలలో రేగే అలల తాకిడిని చూసి పొంగిపోకోయ్..

తనువును తాకిన ఊహల అలజడికి..
అరిపాదాన రేగే అలికిడిని అదిమే..నా స్థితిని చూసి చలించకే..

ఈ రాతల, పూతలలోకి పొంచి పొంచి చూసింది చాల్లే ఇక...
అర్ధానివి నువ్వే....అనుభవానివి నువ్వే....ఆసరాకు చిక్కని ఆలంబన నువ్వే..

కాదన్నది ఎవరిక్కడ....!!

✍️అరుణిమలు

No comments:

Post a Comment