Friday, 2 February 2018

తాను నేను

తీరానికి, నావకి తగని తగువొస్తే....
ఇద్దరి మధ్య దూరం తరగని, తెగని తాపత్రయమే...!!

గమ్యం ఎరుగని ప్రయాణాలు.....
ఏ తోడు ఎక్కడ వరకో....!!

దాహం తీరని బంధనాలను తెంచుకొని....
దారులు తెలియని రేవుకై తపన....!!

తనువు ఇక్కడ....
మనసెక్కడో...మలుపెక్కడో....!!!

✍️అరుణిమలు

No comments:

Post a Comment