ఊరుకోవే మనసా
ఉలిక్కి పడకే
ఉత్తుత్తి ఊసులకు..
ఉత్తరాలు కావే అవి
ఊసుపోని గాలి కబుర్లు..
ఊహలకు చోటివ్వకే
ఊరించేవిగా మిగిలిపోతాయి...
ఉసూరనిపించే ఆశలు అవి
ఊ కొట్టకే...
ఊరడించే జ్ఞాపకాలలో
ఊరేగింది చాల్లే...
ఉఊ లలో ఇన్ని ఊత పదాలు ఉన్నాయా
చాలింక
రా ఇక అఆ లలోకి 😉😉😉
✍️అరుణిమలు
No comments:
Post a Comment