Friday, 2 February 2018

తాను నేను

కలిసిన మొదటి క్షణం బలం ఏమో కానీ....
ఏ దూరాలు చెరపని తీరాలం మనం...
ఎదురు పడితే పండిన తాంబూలం...
ఏ కోప తాపాల నీడన పడని ఆత్మీయులం...
కోసుల దూరమే నువ్వు, నేను అనే మాట...

నీ చూపుల నీడలలో అల్లరి చేస్తూ...
నీ కొంటె తనానికి సైగ చేసే జాణనై...
నీ మాటల కోటలలో కొలువై...
నీతో తగవులలో చెరిసమానమై...
నీ వలపుల చేనులో పొద్దు తిరుగుడు నై...

ఓయ్.....నీకై ఎదురు చూపులు దేనికి
నువ్వు రెప్ప చాటున మాటు వేసాక...

చూసే కళ్ళకు ఆరాటం మనమేమిటని
అంతు చిక్కని పదాలమే మనం...
ఈ పదవినోదంలో...

✍️అరుణిమలు

No comments:

Post a Comment