నీ చిరునవ్వుల వెలుగు ముక్కెరై చేరింది...
నీ చూపుల చందనం చల్లదనాన్ని పెంచింది...
నీ కోర మీసం కోరికలకు సవాలు విసురుతుంది...
నీ గుండె సవ్వడి నాలో గుబులు రేపుతుంది...
నీ ఆలోచనల తాకిడి, అయస్కాంతమై నీ వేపు పదమంటుంది...
చాలోయ్.....వెన్నెలను చల్లగా కరిగి పోనివ్వు
రేయిని వెన్నెపూసలా జారిపోనివ్వు...
చలి దుప్పటి ఒప్పుకున్న... నువ్వు దరి చేరకోయ్...
గూడు చెదిరిన గువ్వల్లా....
ఈ నడి రాత్రి, మనసులు చేసే షికారులు చాలిద్దాం...
నీ ఎదలో కాస్తా చోటు నాకు ఇచ్చేయ్ నిదరోతాను...
ఈ ఎద తలపులు, తలుపులు నీకై తెరిచే ఉంటాయి...
వచ్చేయి.... జోలపాడతా
✍️అరుణిమలు
No comments:
Post a Comment