Friday, 2 February 2018

తాను నేను

ఉన్నట్టుండి మనసు ఉలిక్కి పడుతుంది...
ఎవరో పిలిచారనో...తలచారనో కాదు..
అన్నీ తెలిసిన మనసు...ఎందుకో
తనను తాను మభ్య పెట్టుకుంటుంది..

తిరిగి రాని తోడు కోసం తపించి పొమ్మని..
ఎదురు చూడమని..
తలపే ఎరుగని మనసును తలంచమని..
తడి కన్నులను తుడవమని..

ఏం చేస్తున్నావు....పెదవి గడపన ఆపిన
మాట...ప్రాదేయపడుతుంది ఆపకని..
జవాబు రాని చోటకు ఎందుకే అంటే
అర్థం కాదే ఈ ప్రేమకి...

నిర్లక్ష్యం నిండిన నీడను..
ఏమని తడమను బాగోగులు కోరుతూ...

ఆకలి తీరని ఆకసాన్ని ఏమని నిలువరించను
కురవకే అని...
తనివి తీరేది ఎప్పుడు ఈ మనసుకు..
నూతిలో నీటిని ఏటిలో పోస్తున్న...
ఏనాటికైనా సాగరాన్ని చేరుతుంది కదా అని..

నా ఇష్టాన్ని నా ప్రేమ గడపన నిలువరించడానికి
నా అభిమానాన్ని కావలిగా పెట్టా...

✍️అరుణిమలు

No comments:

Post a Comment