నన్ను తాకిన గాలి చిరు కోరికను విన్నవించుకుంది..
ఊపిరి బిగ పట్టేలా కౌగించుకోనా అని...
చలచల్లని సీత గాలి తనువుతో చేసే సయ్యాటలు ఎదలో గుబులు సెగలు రగిలిస్తున్నాయి..
తనను తాకలేనని దానికి ఎంత తెగింపో...
తాకిన చోటల్లా తడి లేని దాహపు అచ్చులు వేస్తుంది..
నలువేపుల తానే ఒక కవచమై కావలి కాస్తూ...
అద్దంకి కోకతో దాగుడుమూతలు ఆడుతూ...
శ్వాసలలో సంతకాలను సరిదిద్దుతూ..
నాజూకు నగవులకు నిషాలను అద్దుతూ..
తానే అంతా అయ్యి ఆడుకుంటుంది....
ఏకాంత వేళ నీ ఊహల నడుమ ఉక్కిరిబిక్కిరి చేసే ఈ ఊసులను వినేది ఎవరు... కనేది ఎవరు...
నా కలవరింతలను గమనించిన ఈ గాలి నిను వెతుకుతూ వస్తుంది...
కాస్త నీ కౌగిలిలో చోటివ్వవోయ్...
ఇక్కడ నా తనువు తరించి పోతుంది...
✍️అరుణిమలు
No comments:
Post a Comment