ఎదనిండా గాయాలే కానీ
నా ఎదురు చూపులు నిండిన చెలమవు నువ్వు....
పెదవి పై అద్దుకున్న పలుకువే కానీ
పిలిచేందుకు పదములే కరువాయే...
ఎదురు చూపుల గడపకు కట్టిన తోరణాన్ని
నిను చూసిన క్షణాన పెదవి తలుపులు విచ్చుకుని మురిసిపోవడం ఎందుకో...
కళ్ళ నిండా అనుభవాల అగాదులు
కానీ నిను చూసేందుకు ఈ తపన దేనికో...
నీ ద్యాసకు పరద్యానం కూడా కాను నేను
కానీ ఇక్కడ నీకై నీ ద్యాసలో పరద్యానాల పాలవుతున్న...
చుట్టూ ఎన్నో వింతలు,విశేషాలు
నాకు మాత్రం నువ్వనే చింతే ఒక పెద్ద వింత...
నవ్వుల ఆలచిప్ప వెనుక దాగిన ఒక ముత్యపు నిజాన్ని నేను...ఎవరికీ అందని అగాధమే దాని నివాసం...
నీకు నాకు.... ఈ తాను నేను కు తప్ప ఎవరు ఎరగనిది ఈ అరుణిమ....మన ఈ అరుణిమలు
✍️అరుణిమలు
No comments:
Post a Comment