Friday, 2 February 2018

తాను నేను

కొన్ని కలలను ఇస్తాను.......నిజం చేసి ఇస్తావా అని అడగాలని ఉంది...
కొన్ని నవ్వులను ఇస్తాను.......నీ ఎద సవ్వడిగా దాచేసుకుంటావా...
కొన్ని ఆశలను ఇస్తాను.......శ్రమ అనుకోక వాటిని సాకారం చేస్తావా...
కొన్ని కోరికలను ఇస్తాను......కష్డమనుకోక వాటికి రూపాన్ని ఇస్తావా...
కొన్ని బిడియాలను ఇస్తాను......నాకాడ దేనికని బందించేస్తావా....
నా ప్రేమను ఇస్తాను........కంచెగా మారి కావలి కాస్తావా.....

నన్నే ఇచ్చేసుకుంటున్న......నీ ఇష్టాన్ని కుంచెగా మార్చి దిద్దిన రూపాన్ని అని.......
నన్ను ఏలేసుకో నీ ఎద సీమకి రాణిని చేసి....

నీ మది పరదాల మాటున..మకుటం లేని మహారాణి నే...
నీ పెదవుల పై చెరగని చిరునవ్వు ఆభరణాని నే....

నిన్నేనోయ్.......నీ గూటిలో ఒదిగిన గువ్వని నేను
నువ్వు దాచేసుకున్న....దోచుకున్న పరువాన్ని....

✍️అరుణిమలు

No comments:

Post a Comment