నువ్వు కసిరితే.... నా చిరునవ్వు ముడుచుకుంది...
నువ్వు నవ్వితే.... నా మనసు నేలపై నిలవనంది...
నువ్వు కను సైగ చేస్తే.... నా మోము విరిసి మురిసింది...
నువ్వు నుదురు ముడి వేస్తే.... నా పెదవి ముని పంటి కింద నలిగింది...!!!
నాలా నేను...
నాకోసం నేను....
ఉండాలనే ప్రయత్నాల అన్నింటిలో ఓడిపోయా...
అందుకే నీలా కాకున్న నీవై ఉండిపోయా, నే ఇలా...
✍️అరుణిమలు
No comments:
Post a Comment