ఎందుకొచ్చావు నా జీవితంలోకంటూ
........ఎన్నోసార్లు అడిగాను నిన్ను
ఎందుకు రానిచ్చానని ప్రశ్నించుకున్నాను
..........ఎన్నోసార్లు నన్ను నేను
కోరి వచ్చిన నీ దగ్గరే జవాబు లేదు
..........ఎందుకొచ్చావో
..........ఎందుకు పోయావో
కారణాలు లేకుండా ఆహ్వానించిన
.......నా దగ్గర మాత్రం
.......జవాబు ఉంటుందా
హా.....ఒకటి చెప్పగలను... నేను మాత్రం
నా ఙాపకాలలో నువ్వు ఎప్పుడు
........పదిలమే ప్రాణం ఉన్నంతవరకు
✍️అరుణిమలు
No comments:
Post a Comment