ఒకటిగా కలిసి వేసిన అడుగులు...
చేయి చేయి పట్టి నడిచిన దూరాలు...
పంచుకున్న నవ్వుల వాయినాలు...
అందుకున్న ఘడియలు...
గడిపిన కాలం...
పేర్చిన ఆశల గూడు...
ఒకరి కనులలో ఒకరు మునకలు వేసిన రేయిలు...
వేచి చూసిన ఎదురు చూపులు ఇచ్చిన వేతనాలు...
ఓయ్.....ఎన్నో ఎన్నో మరెన్నో పెదవి పలకని మనసు దాచేసుకున్న అనుభూతులు...
వెనక్కి తిరిగి చూస్తే అవన్ని వర్ణనలకు అందని పెదవి పై చిరునవ్వుగా నిలిచే ఙాపకాలు...
చాలోయ్....చెదరని ఆ అనుభవాలు...చిక్కిన ఈ చెలిమి...చెరిసగమైన దేహాల మధ్య చిగురించిన నా కోరికలు....చిత్రించలేని నా వాడిన ఆశలు...
చాలు ఇవి....నీతో నా ముందడుగుకు
నాలో ఊపిరిగా నిన్ను నింపుకునేందుకు...
✍️అరుణిమలు
No comments:
Post a Comment