నిదురకు పోతే....కలతవి అవుతావు
నిదుర చెదిరితే.....ఎడబాటువు అవుతావు
కలే కంటే కంటికి...... అంటిన కాటుక అవుతావు
నిన్నేనోయ్..... ఎక్కడున్నావోయ్ అని పిలిస్తే
ఇక్కడేనోయ్ అంటూ బదులొచ్చింది నా మది నుండి
😍😍😍
నీ తోడు కన్నా.....నీ తలపు బాగుందోయ్
దూరం అవుతావనే..... భయం లేదు
కోల్పోతానన్న భ్రమ లేదు....!!!
✍️అరుణిమలు
No comments:
Post a Comment