రాత్రి మేల్కొంటుంది ఇక్కడ...
అక్కడ నువ్వు నా కలల ప్రపంచం లోనికి అడుగు పెట్టగానే...
హేమంతం తడుముతుంది హిమ బింధువై ఇక్కడ..
నీ వరాల జల్లులలో తడిపేస్తూ...
ఇష్టాక్షరాలను నా చేత లిఖిస్తూ...
నీ పేరును పఠిస్తున్న పెదవుల కమ్మదనం రుచి చూసేందుకు తాపత్రయం పడుతున్న నవ్వు...
కళ్ళలోని ఎదురు చూపుల కాంక్షను కొసరి కొసరి రుచి చూస్తున్న కాలం...
వెన్నెల కోకను వయసుకు కట్టబెట్టి తనివితీరా చూస్తున్న ఆ నింగి...
దూరానికి కూడా దయ కలిగేలా ఉన్న నా ఊహల ఊసులు నిను చేరుతునే ఉన్నాయి...
నా కోరికను విన్నవించడానికి కాదు...నా ఇష్టాన్ని తెలిపేందుకే...
నువ్వు ఎదురుగా ఉన్న నా అడుగులు నీవేపు కదలడం లేదు... నా ప్రేమ నిన్ను వదిలి రావడం లేదు...
అచ్చు ఆ నింగి నేల లానే నువ్వు నేను...
మనమంటుంటే కలిసే పెదవుల తాకిడి నా ఎదకు ఆయువు పోస్తుంది...
అనుక్షణం నా తోడువి..తలెత్తి చూస్తే నా నీడవి...
ఎద భారాన్ని దించే వేళ వాన చినుకువు...
గుండెలకు హత్తుకునే వేళ వెన్నెల గంధానివి..
నాలో నాకు చోటుంచని...నా నుండి నన్ను దూరం చేసిన నా మానస చోరుడవి...
ఇప్పుడు చోద్యం చూస్తూ ఉన్న నా కలల చకోరానివి...
✍️అరుణిమలు
No comments:
Post a Comment