చలి తాపాన్ని చెరి సగం పంచుకుందాం...
చెలి చీర అంచుకు చిరు గాలిని ముడి వేసేద్దాం...
చీకటి పానుపు పై తార చంద్రులం అవుదాం...
చిలకలు చుట్టిన నెలవంక వై చిన్నదాన్ని చేధించకోయ్...
జయాపజయాలన్ని వేకువజాముకు మంచు బిందువుల్లా కరిగిపోతూ...
ఉదయిద్దాం మళ్ళీ ఏలేటందుకు మనస్సులను...
✍️అరుణిమలు
No comments:
Post a Comment