Friday, 2 February 2018

తాను నేను

పలుకే బంగారమాయే అనను..
నీ అలికిడి చాలు ఇక్కడ అలజడలు మొదలు అవ్వడానికి...

నీ మాటలలో పడితే...లోకాన్ని నీలో చూస్తా ఉండిపోతా
నువ్వే మౌనాన్నివి అయితే...లోకమంతా నువ్వే కనిపిస్తావు...

ఓయ్....బండరాయి
వినడానికి చెవులు పని చేస్తున్నాయి కదూ...

నీ మనసెలాగూ షికారులు కొడుతూ ఉంటుంది...
దానికి కళ్ళు లేవు కానీ నీకు ఉన్నాయి కదా...

ఏవిటో....
నిన్ను అనాలి...లేదా నీతో పడాలి...ఏదో ఒకటి లేకపోతే కష్టమే సుమీ...

అవును....ఏవిధంగా అయినా ఈ పెదవి నిన్ను స్మరించాలి
ఆ విదంగా అయినా నీకై తపించే మనసును శాంతింప చేయాలి...తప్పదు మరి...

కదిపేసి పోయావు....
కన్నీళ్ళో, పన్నీరో ఏం చిలకరించిన నీకే, నీకోసమే కదా...

అనుభవించు రాజా.....

✍️అరుణిమలు

No comments:

Post a Comment