ఎదురు చూసినంత కాలం కూడా నిలవదు సంతోషం...
నత్త నడకన నడిచిన కాలం కాస్త.....నీటి బిందువు లా జారి పోతుంది....
పట్టి ఉంచేవి కావు....పట్టు జారేవి కాదు బంధాలు...
నిర్లక్ష్యమా..... కాదు చిన్న తాకిడి జాలు విలవిల లాడేందుకు...
పట్టువిడుపుల మధ్య నలిగే మదిని ఓదార్చేది చెంపను తాకిన చెమ్మే....
ఆత్మ ఉంది దానికి అభిమానం ఉంది....
ఇష్టం ఉంది దానికి కనికరం ఉంది....
కన్నీరు ఉంది దానికి కారణం ఉంది....
మనసుంది దానికి నోరు మాత్రం లేదు...
పదిమందిలో ఒకరుగా ఉండగలం...
ఒంటరిగా ఉండగలం....
కానీ అవసరంగా మాత్రం ఉండలేం....
✍️అరుణిమలు
No comments:
Post a Comment