కాలం వెళ్ళి పోతుంది జ్ఞాపకాలను వదిలేసి..
గడియలు, నిమిషాలు, క్షణాలుగా మారి జారి పోతుంది..
నిన్న ఒక అనుభవంగా మారి నీడల్లే నడుస్తుంది మన తోడుగా...
నిన్న కొత్త, ఇవ్వాళ పాతగా మారిపోయి మరుగున పడుతుంది...
అపురూపాలన్ని అక్కరకు రానివిగా మిగిలిపోతాయి...
రేపేంటి అనే ప్రశ్నకు ఇవ్వాళ... రేపటి వేపు చూడటానికి ఏముంది అనే ప్రశ్నను పెడుతుంది...
కొన్ని కన్నీటి చుక్కలు జల్లిన కళ్ళాపులో మనం పొగొట్టుకున్న అభిమానాలు,నమ్మకాలు రంగవల్లికలై కనపడుతుంటాయి...
నిన్నటి సంవత్సరానికి, మన వయసుకు ఒక అంకెను కలుపుతూ పెద్దరికాన్ని కట్ట బెడతాయి...
ఆ గాలి...ఈ ఆకాశం...
పగలు, రేయి..
ఋతువులు...అన్నీ అలాగే ఉన్నాయి...
ఒక్క మనిషి తప్ప...
మారే విలువలు...మారే మనసులు...మారే అవసరాలు...
మారే బంధాలు...మారే ఇష్టాలు...
ఇక్కడ అన్నీ మార్పులే...
మారని వారు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే...
కొందరు గొంగళులే...సీతాకోకచిలుకలుగా మారే రోజులు వచ్చే వరకు...
నవ్వులను అద్దుకొని నడయాడే బొమ్మలే ఎందరో...
✍️అరుణిమలు
No comments:
Post a Comment