Wednesday, 8 August 2018

తాను నేను

నువ్వో అధ్బుతమైన మజిలీవి
ఎప్పటికి నా దృష్టిలో...

నా అడుగులను ఆపింది నువ్వే,
నువ్వనే ఒక నిజాయితీ...
నీ మాటలలో తేట తనం
నా చూపును నీపై నిలిపింది...

నన్ను నేను తెరిచిన పుస్తకమై
నీ ముందు ఉంచాను...
అందులో నువ్వొక పుటవు అవుతావని
ఆనాడు అనుకోలేదు రా...

మాటగాడివి ఏమో అల్లరి పదాల నడుమ
చిలిపి పదాలుగా కలిసిపోయాము..
అభిప్రాయాలు వేరైనా
మనమై ఇష్టాలలో ఇమిడిపోయాము..

వరసలు కలిసినాక
అలకలన్ని ఙ్ఞాపకాల కానుకలు అయ్యాయి..
కోపతాపాలంటూ వచ్చినవన్నీ
చుట్టాలై చోద్యం చూసి చెదిరిపోయినవే కదా..

అహమో, అపనమ్మకమో
ఎందుకో ఇప్పుడు ఈ దూరాలు..
నిశ్శబ్దంలో మునిగి పోయాక
నీ మాటల కన్నా ఈ మౌనమే బాగుంది..

ఏ ప్రశ్న నన్ను గాయం చేయలేదు
ఏ అహం నన్ను అణిచివేయదు
హా....మనమనే దూరం తప్ప

✍️అరుణిమలు

No comments:

Post a Comment