నువ్వో ఆశవు
నాలో మొలకెత్తి...నన్నే తుంచేసిన ఆశవు
అనుబంధాల పేరిట ఆటలు
ప్రేమ అనే పాశంతో ముడివేసి..
కోరికలు,అవసరాలు నడుమ
మనసు నలుగుబాటును పక్కన పెట్టి..
ఆలోచనల లోతుని అందుకోలేక
నా లోనే నిన్ను దాచేసుకున్న అతివను..
ఎద గడప పై కాచుకున్న
ఎదురు చూపుల ఎడబాటు ఏమని వర్ణించేది..
చుట్టూ రంగుల లోకం
కళ్ళ నిండా వెలసిన రంగుల కలలే..
ఎందరో నా చుట్టూ
అందులో నువ్వు ఎక్కడ అని వెతికే నా చూపులు..
ఎన్నో ఊసులు ఎదలో సవ్వడి చేస్తున్నాయి
వినేటందుకు నువ్వనే కొరత మిగిలింది..
అంతం లేని నా అక్షరాల మొలకలలో
నువ్వో అంకురించే భావానివి..
సాగుతునే ఉంది మన ఈ తాను_నేను
అక్షరాలను వారధిగా చేసుకొని..
అర్ధాల పట్డింపులు లేని తీరంలో నువ్వు ఉన్నావు
అక్షరాలే తప్ప మాటలు రాని మౌనాన్ని నేనయ్యాను..
✍️అరుణిమలు
No comments:
Post a Comment