Wednesday, 8 August 2018

తాను నేను

కలలు నన్ను వదిలి పోయాయి
నిన్ను వెతికేందుకు..

నిదుర దరి చేరనంటుంది
కలత చెప్పే కథలకు..

ఎదురు చూపు లే మిగిలాయి
ఎండమావికై..

ఓర్పెంతుందో...
ఓటమిని అంగీకరించి చవిచూసాక కూడా

నటనలను నేర్చిన నవ్వులు మిగిలాయి
నమ్మబలకుతు..

రేపంటే ఆశే...
నువ్వు వస్తావని కాదు..
నిను తలవని గడియంటూ
నాకు మిగులుతుంది ఏమో అని...

✍️అరుణిమలు🖤

No comments:

Post a Comment