Wednesday, 8 August 2018

తాను నేను

సందిగ్ధం....
ఎటూ తేలని నిర్ణయాల నడుమ అంతా అయోమయమే...

మనసుకు మాటలు రావే
ఇదని నివేదించడానికి...ఏదని చెప్పడానికి
దాని మూగ వేదన అంతా
లోలోన దాచి మనశ్శాంతిని దోచేస్తుంది...

భవిష్యత్తు నీవైపు ఉంది
నువ్వనే తోడు నిర్భయంగా నన్ను నిలబెడుతుంది..

నీ పాదాలపై నన్ను ఉంచి...నా భారమంత నీదై
నను నీ గుండెలపై పసిపాపల దాచుకుంటాను అంటే...
మనసు మళ్ళీ మళ్ళీ కొత్తగా నీ లాలన కోసం పుడతా అంటుంది ...

ఎన్నో ఆశలు....ఎన్నో అంచనాలు
మరెన్నో ఊహలు
నువ్వనే ఒకే ఒక్క ప్రేమ..
నన్ను నన్నుగా నిలవనియ్యడం లేదే..

రాలేను నాకై నేను నీ వేపు..
తీసుకుపోరాదు వచ్చి నీతో అధికారంగా..
నీ చేయి వదిలే శక్తి ఉందా ఈ మనసుకు..

✍️అరుణిమలు

No comments:

Post a Comment