విరహాల గుప్పిళ్ళు కాస్తా వలుపుల మబ్బులై
నీ కోసం కబురు మోసుకు వస్తున్నాయి...
ఏ ఏకాంతాలలో నువ్వు
ఈ కాంత కోసం కమ్మని కలలు కంటున్నావో
జవాబు ఇస్తావా
జవాబుగా నువ్వే ఎదురు వస్తావా
ఊహించని మలుపులే కదా
నీ ఊహల ప్రయాణంలో నేను దాటినవి
మరి ఈ సందేశాన్ని
సందేహంగా వదిలేయకోయ్
చిరుగాలిలా వచ్చి
చిన్నదాన్ని చేయి అందుకొని
చైత్రమై అల్లుకు పోరాదు ❤❤
✍️అరుణిమలు
No comments:
Post a Comment