కొన్ని ఆలోచనలను చేధించాలని
కొన్ని మౌనాలని వదిలి బయట పడాలని ఉంటుంది..
జవాబులు లేని ప్రశ్నలా అవి
కాదు...
కానీ పెదవి పలకలేని ప్రశ్నలు..
మనసు అంగీకరించని జవాబులు ఏమో
నిజమే...
చూసి చూడనట్టు
వినీ విననట్టు
తెలిసి తెలియనట్లు
అంగీకరించి కూడా ఏకీభవించనట్టు..
మనసుకెందుకో
ఇన్ని బలహీతలను కానుకగా ఇస్తుంది..
ప్రాధాన్యం లేనిచోట నిలవడం దేనికో
ప్రతిఫలంగా మారని చోట ఫలితాన్ని ఆశించడం
ఏవిటో...
మనసనేది లేకపోతే
ఈ మనుషులం ఎవరికి ఎవరు ఎమౌతామో..
మతిలేని పనులకు మూలం అదే
మనది కాని దానిని మనదిలా చూపిస్తుంది..
మరుపుకు తావేదంటు అడ్డంగా ఉంటుంది..
నిన్ను తిట్టడం ఇష్టం
దెప్పడం ఇష్టం
నన్ను నేను సూటిగా అనుకోలేనివన్నీ
నిను తాకి నన్ను చేరుతాయి అని తెలుసు కదా..
అందుకే నిన్ను అనేది పిచ్చి మనసా..
✍️అరుణిమలు
No comments:
Post a Comment