చోటుకు చోటెక్కడ ఉంది అన్నట్లు పక్కపక్కనే ఒదిగిన గువ్వలమై..
మాటల గూటిలో తలదాచుకొని..
వెచ్చని శ్వాసలలో అల్లుకొని..
గుసగుసలకు చోటిచ్చి..
నీ అరచేతిలో అక్షరాలను దిద్దుతూ, తడబడతూ ఊ కొడుతూ...
నీ భుజమనే భరోసా పై తలవాల్చి
ధైర్యాన్ని కూడగట్టుకుని పెన వేసుకున్న మన చేతులు చేతలలో మునిగిపోయి ఉండగా..
నా చెక్కిలిని తాకిన నీ అధరాల అద్దకం..
అచ్చు పుడమిని తాకిన చినుకులా ఉందేమో
తనువంతా పులకించి, పట్టు పావడ చుట్టేసిందోయ్ సిగ్గుల చాటున దాగి..
మరువ గలనా నన్ను... అదే నాలో దాగిన నీ ఙ్ఞాపకాలను
తెంచేయగలనా నీ తలపులను నెమరేస్తూ
నీ ఊహలలో ఊరేగే మనసును...
కుదరదోయ్...
కాలం కసిరినా...విసుక్కున్న
నువ్వు అద్దిన అద్దకాలను చెరపడం
నువ్వేమన్నా పచ్చబొట్టువా కాదే పుట్టుమచ్చవి ❤❤
✍️అరుణిమలు
No comments:
Post a Comment