అక్షరాలలో లక్షణంగా ఉంటావు
నాతో కలిసిపోయి...
ఎన్ని వింతలో కదా పొంతన కుదరని
పదాల నడుమ నలిగే రహస్యాలలో...
వాస్తవానికి నువ్వో వచ్చి పోయిన
వాన జల్లువి...
ముసురేసిన నీ ఙ్ఞాపకాల మబ్బుల నీడలే
మిగిలాయి ఇక్కడ...
మబ్బుల మాటున ఎన్నో ఆశలు
ఆశగా తాకితే కరిగిపోయేవే కదా...
నీ తలపో తొలకరై
నన్ను తడిమి పోతుంది...
నీ వలపో వసంతమై
విరబూస్తుంది...
మన దూరం మాత్రం
శిశిరమై నిలిపోయింది...
తలంచిన,తలొంచిన
తడి కన్నులలో ఉన్న నీ కోసమే కదోయ్...
సమాధానం కోరని ప్రశ్నలు
చిరునామా ఎరగని ప్రేమలేఖలు...💌💌
ఇవేగా మన కథను చెప్పకనే చెప్పేవి..❣️❣️
✍️అరుణిమలు
No comments:
Post a Comment