రేయి పడక ఎక్కింది
మన జాగారాలు చూసి..
చుక్కలు రాలిపోతున్నాయి
మన కను మూలన
కోరికలై కరుగుతా..
నిలువరించ గలనా
నీ బాహువులలో ఒదిగిన
నా మనసును..
చీకటి దుప్పటిలో
దాగిన చెకోర పక్షులమై
వెన్నెల విందులను ఆరగిద్దాం..
రాతిరికి ఇంత ఉలుకేంటో
మనల్ని చూసి..
మిడిసిపడి ఉరుముతోంది తెల్లారమంటు..
మురిపాల మునిపంటి గాట్లకు
ముద్దుల లేపనం బాకీ ఉందోయ్..
బాకీ రేపు కదా
సరే సరే..
✍️అరుణిమలు
No comments:
Post a Comment