ఎంతెంత దూరాలో
తెలియని ప్రయాణాలలో
ఇంతింత చేరువయ్యే
ఈ పరిచయాలు ఏంటో..
చేరువకు అర్థం చెబుతున్నామా
అనే ఆలోచనకి..
మనసు మురిపెంగా గిచ్చి
మరీ చెబుతుంది..
దూరెమంత ఉందో
చూడవే పిల్ల అంటూ..
ఆలింగనంలో ఏముందో
నీ ఎద సింహాసనం పై చేరాకే తెలిసిందోయ్..
కట్టేసేయ్...రెండు మనసులను జతచేసి
రెండు తనువుల సాక్షిగా..
కట్టేసుకో...ఎవరు నేననే
ప్రశ్నకు జవాబు నేనంటు నువ్విచ్చేయ్..
ఓయ్....కథలు అల్లింది చాలోయ్
నిజంగా నిజం చేసేద్దామా ఇక 😉😉
✍️అరుణిమలు
No comments:
Post a Comment