నిన్ను చూడటం నాకు అలవాటు
నా చూపులకు ఒక వ్యసనం నువ్వు..
నా కళ్ళలో నువ్వు చేరిన ప్రతీసారి
ఎన్ని కౌగిలింతలో నా మేనుకు..
ఎదురు చూపుల గడప పై
ఆనుకున్న అనుభూతులు ఎన్నో..
నిన్ను చూసిన, తలంచిన పెదవులలో
పూచే సిగ్గుల మరువం..
నా కనులకు నువ్వొక విందు ఎదకు శ్వాసను ఇచ్చేందుకు..
నా కనుల పందిరిలో నువ్వో వెలుగు చుక్కవు మనసును అలరిస్తూ..
నువ్వెక్కడ ఉంటే అక్కడ
ఏయ్... అనవోయ్
ఓయ్.... అంటూ
ఇక్కడ పలవరింత నన్ను పలకరిస్తుంది..
✍️అరుణిమలు
No comments:
Post a Comment