Wednesday, 8 August 2018

తాను నేను

పగటి కలలు కనడం అదో సరదా..
నా ఆధీనంలో ఉంటాయి కదూ..

ఊహలలో అయినా కొద్ది సమయం
నీతో బతకాలని...
నేను మెచ్చిన వాడితో,
నన్ను మెప్పించుకున్న వానితో..

నిజం కానీ స్వప్నాలకు ఊహలను జత చేసి
నాలో నేను నీతో బతికేస్తున్న..
ఏవోయ్ అనే పిలుపుతో మొదలయ్యే నా తలపులు కనుల తలుపులు మూత పడే వరకు కొనసాగుతునే ఉంటాయి..

నా అల్లరిలో భాగానివై
నా కోపంలో ఓదార్పు వై
నా ఇష్టంలో ఇమిడిపోయి
నా దుఃఖంలో దోసిట వై
నా పిలుపులో పదమై..

అసలు నేనంటూ ఎక్కడ మిగిలానోయ్
నేనంటే నువ్వే కదా..
నాలో నాకై మిగిలిన నా తోడువి కదూ..!!

✍️అరుణిమలు

No comments:

Post a Comment