Wednesday, 8 August 2018

తాను నేను

తెగి పడని ఆలోచనలు ఎందుకో, ఎటో పదమంటున్నాయి...!?

అటు తిప్పి, ఇటు తిప్పి
తెచ్చేది నీ ముందుకే కదా...!!

ఇచ్చింది తిరిగివ్వడానికి ముందే ఉంటావు..!!
దాచుకోమంటే మాత్రం
నాకెందుకంటు వెనుకడుగు వేస్తావు...!?

పరిగెడుతుంది మనసు.. !!
నిను చేరాలని కాదు
నీకు దూరం కాకూడదు అని..!?)

ఆదరణ అంటే ఆలింగనం కాదోయ్
అక్కున చేర్చుకోవడం..!!!

జల్లెడ పడుతున్న ఆశలను..!!
జారిపోనిది ఎప్పుడు ఒకటే ఆశ
నువ్వున్న ఈ చోటు ఎప్పుడు ఇలా పదిలమై పోవాలని..!!

మాటిచ్చుకున్నాం....వంతులు వేసుకున్నాం
వాటాలు హద్దులు దాటలేదు..!!

చేతలు మాత్రం మన మధ్య గిరి గీస్తున్నాయి..!?
ఎందుకో...??
ఎంత వరకో....!??

✍️అరుణిమలు

No comments:

Post a Comment