గాలి వాటు రాకపోకలు దేనికోయ్
శ్వాసవై నిలిచిపోరాదు
పన్నీటి జలకాలు దేనికి
నీ పలుకుల పలకరింపులలో మునిగాక
అక్షర కేళిలో మన రాశ లీలలు ఎన్నో
రసరమ్య తీరాలను తాకుతునే ఉన్నాయి
దప్పిక దేనికో ఈ దరహాసానికి
దగ తీరని ఎడారిలో
అత్తరు దేనికోయ్
నీ ఊపిరిలో చిత్తు అయ్యాక
కానుకలు ఎక్కడ
కోరికల పంజరంలో చిక్కాయా
రాతిరి వేడెక్కుతుంది ఇక్కడ
ఊపిరి సెగలతో
జాతర జరుగుతుంది
జానపదాలు లేవు జతులు లేవు
నిశ్శబ్దం సెగలు కక్కుతుంది
కరుగుతున్న ఆశలకు సాక్షిగా
పెదవి తాంబూలం పండిందోయ్
విరబూసిన మన నవ్వుల సాక్షిగా
✍️అరుణిమలు
No comments:
Post a Comment