ఎదురు చూసినంత సేపు
నిలవదోయ్ ఈ కాలం..
చిలిపి మాటలు కాస్తా
చిటపటలై పేలుతూ..
అల్లరి కాస్తా
అలకలుగా మారడమేంటో..
ఊసుపోని నిమిషాలు
ఏమో చిరాకు పెడుతుంటే..
విసుగొచ్చే ఙ్ఞాపకాలు
ఒకపక్క అటా,ఇటా అంటూ ఉంటే..
మళ్ళీ మళ్ళీ ఏకాంతాలతో
సహవాసం..
నిట్టూర్పులు మధ్య
మరో ఎదురు చూపుల పర్వం మొదలు..
పెదవి విరుపులు కనపడనివ్వకుండా
నిన్ను గమనించడంలో ఏదో గమ్మత్తు ఉందోయ్..
హ్మ్....ఏదవ్వని
తగ్గేది లేదు లే...
✍️అరుణిమలు
No comments:
Post a Comment