రెప్ప మూసినంత చీకటి చాలు ఏమో
నాతో నేను మిగిలేటందుకు...
నన్ను నేను ప్రశ్నించేటందుకు..
ఏవిటో కొన్ని నిర్ణయాల కోసం
మనసు పడే ఆరాటం..
అన్ని కావాలని, ఏది పోగొట్టుకోననే
మనసు మారాం ఒకపక్క..
లోకానికి తెలియని ఆశలు పురుడు పోసుకొని
వాటిని నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తుంటే...
మనసు చేసే మౌన ఘోషకు
ఈ చీకటి చాలేమో..
పేరు లేని బంధాలను వదల లేక,
వెంట నడవలేని బేల తనాన్ని సముదాయిస్తూ..
ఎవరికెవరు అనే లెక్కల్లో నుండి
నేనెవరిని అనే సమాధానం వెతుకుతూ..
అప్పుడప్పుడు మౌనం కావాలనిపిస్తుంది
చీకటిలో ప్రశ్నిస్తూ..
ఆ చీకటిలో చెమ్మగిల్లి పోతూ..
అదే చీకటిని నిందించాలని..
✍️అరుణిమలు
No comments:
Post a Comment